తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

  

 

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. కాగా గత నెల 16న వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేయగా, బుధవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ మాధవిదేవి, జస్టిస్‌ తుకారామ్‌, జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.