కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటున్నారన్న రేవంత్
గిరిజన ప్రాంతాల్లో పోడురైతుల పొలికేకహైదరాబాద్,అక్టోబర్5 ( జనం సాక్షి) : పోడు భూముల హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతులకు పట్టాలిచ్చి వారికి భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో అఖిల పక్షం చేస్తున్న పోడు రాస్తారోఖోలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. పోడు రైతుల విూద పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి భూములపై చట్టపరంగా హక్కులు కల్పించాలని రేవంత్ డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకూ పోడు రైతుల పొలికేక కార్యక్రమం జరుగుతోంది. ఆంధప్రదేశ్ ` తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అశ్వారావుపేట బోర్డర్‌లో మిత్రపక్షాలు ధర్నా, రాస్తారోకో చేపట్టాయి. ఈ కార్యక్రమం సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, టీడీపీ నుంచి పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వరావు, రాష్ట్ర అధ్యక్షుడు బత్తిన నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు ఏలూరు కోటేశ్వరరావు, సీపీఐ(ఓ) న్యూ డెమొక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆధ్వర్యంలో జరుగుతోంది.