కెసిఆర్‌ ఆవేదన కనువిప్పు కావాలి !

భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో రాజకీయ సవిూకరణాలు జరగడం ఇప్పడే కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. తాజాగా రైతుల సమస్యలపై, రైతు చట్టాల ద్వారా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు పోరాడుతున్నాయి. తాజాగా సిఎం కెసిఆర్‌

మరోమారు అసెంబ్లీ వేదికగా కేంద్రంపై పోరాడుతామని ప్రకటించారు. కేంద్రం వివక్షతపై ఘాటుగానే స్పందించారు. వివిధ అంవాల ఆధారంగా ఆయన చేసిన ప్రకటన చూస్తుంటే అందులో నిజం లేకపోలేదు. నిధుల విడుదల కావచ్చు..పద్మశ్రీలకు పేర్లు పంపడం కావచ్చు...పర్యాటక అభివృద్ది కావచ్చు.. అనేక సమస్యలు ఉన్నాయి. కెసిఆర్‌ కేవలం అసెంబ్లీలో మాత్రమే మాట్లాడారు. బయట మళ్లా ఎక్కడా మాట్లాడడం లేదు. ఎపిలో అయితే సిఎం జగన్‌ కేవలం ఎపి రాజకీయాలకే పరిమితం అయ్యారు. టిడిపిని అణగదొక్కడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఉమ్మడిగా సమస్యలపైనా లేదా... కేంద్రంపై పోరాడుదామన్న ఆలోచనలో జగన్‌ లేరు. గతంలో ప్రత్యామ్నాయం అంటూ బయలుదేరిన కెసిఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల తరవాత మళ్లీ మాట్లాడడం లేదు. తాజాగా అసెంబ్లీలో యాన కేంద్రంపై చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే మరోమారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఏమైనా ఉందా అన్నది కూడా తెలియదు. అయితే కేంద్రం వివక్షపై ఎవరైనా పోరాడాల్సిందే. బిజెపికి ప్రత్యమ్నాయంగా గతంలో ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం రాజకీయాలు తప్ప వీటికి రాజ్యాంగ ఎజెండా ఏదీ లేకపోవ డమే. కేసీఆర్‌ తనదైన శైలిలో భారత రాజకీయాలకు ఒక కొత్త ఎజెండాను తెరవిూదికి తెచ్చినా ఎందుకనో మళ్లీ మౌనం వహించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత అంతా బాగుంటుందని ఆశించారు. కానీ కేంద్ర. రాష్టాల్ర మధ్య సరైన సయోధ్య ఉండడం లేదు. కేంద్రం నుంచి నిధుల బదిలీ సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బకాయిలు అడగనిదే ఇవ్వడం లేదు. అడిగినా సక్రమంగా ఇవ్వకుండా సతాయిస్తున్నారు. అలాగే విపత్తుల సమయంలో తగిన సహకారం అందడం లేదు. బిజెపి సంపూర్ణ మెజార్టీతో గద్దెనెక్కినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రధాని మోడీ కాంగ్రెస్‌ నేతలకన్నా దారుణంగా నిరంకుశంగా వ్యవహరి స్తున్నారు. రాష్టాల్రను పెద్దగా లెక్క చేయడం లేదు. రాజకీయమే పరమావధిగా ఆయన సాగుతున్నారు. తాజాగా ఎపి, తెలంగాణ వ్యవహారాలే ఇందుకు నిదర్శనం. అందుకే ధిక్కార స్వరం వినిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎవరూ ఊహించని రీతిలో అసెంబ్లీ వేదికగా పోరాట అస్త్రం ప్రయోగించారు. జాతీయ రాజకీయాలు నడుస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర పెత్తనాన్ని నిరసించేలా స్పష్టమైన ప్రకటన చేసారు. మోడీ ప్రభంజనం అప్రతిహతంగా సాగుతున్న వేళ కెసిఆర్‌ ఇలాంటి ప్రకటన చేస్తారని ఎవరూ అనుకోలేదు. నిజంగా మోడీ తీరువల్లనే కెసిఆర్‌ కూడా విసిగిపోయి ఉంటారు. కేంద్ర,రాష్ట్ర సంబంధాలతో పాటు ఫెడరల్‌ వ్యవస్థలో ఎవరి పరిధులు ఏమిటన్నది చర్చ జరగాల్సిన సమయం ఇది. ఎందుకంటే కేంద్రం పెత్తనం సహించబోమన్న రీతిలో గతంలో కాంగ్రెస్‌పై తిరుగబాటు బావుటా ఎగుర వేయడం ద్వారా ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరిగింది. ఏడేళ్లుగా కేంద్ర పెత్తనమే తప్ప మరోటి కనిపించ నప్పుడు అంతకు మించిన ధైర్యం ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడు కెసిఆర్‌కు ఏర్పడిరది. అందుకే కేంద్రం తీరును ఆయన అసెంబ్లీ వేదికగా గట్టిగానే దుయ్యబట్టారు. ఇది ఇతర రాష్టాల్రు కూడా గమనిం చాలి. మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, స్టాలన్‌లు కూడా తమవంతు పోరాటం సాగిస్తున్నారు. జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనా విధానం దేశంలో చర్చకు దారితీస్తున్న వేళ ఫెడరల్‌ వ్వయస్థపై ముందుగా చర్చించాలి. కేంద్ర రాష్టాల్ర మధ్య స్పష్టమైన అజెండా ఉండాలని మేధావులు కూడా
కోరుకుంటున్నారు. అభివృద్ది చేశామంటున్నా, నిధులు విడుదల చేశామని గొప్పలు చెబుతున్నా రాష్టాల్ల్రో అభివృద్ది అన్నది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. అభివృద్ధి అన్నదానికి కొలమానం ఏదీ లేదు కనుక పాలకుల ఎవరికి వారు తాము చేసిందే, ప్రస్తుతం చేస్తున్నదే గొప్పని చెప్పుకోవడంతో సరిపోతోంది. మోడీ కూడా అదే పద్దతిలో ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపిల హయాంలో పాలకులు ఎవరికి వారు తామే మంచి పాలన అందించామని, ప్రజల జీవనస్థితిగతులను మార్చామని గొప్పగా ప్రచారం ఏడేళ్లుగా మోడీ అద్బుతాలు చేశానని చెప్పుకుంటున్నారు. ఆయన పాలనాపగ్గాలు చేపట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కితాబు ఇచ్చుకున్నారు. అయితే ఎలాంటి అద్భుతాలు చేశారన్నది ప్రజల జీవన స్థితిగతులను, సమస్యలను పట్టించుకున్న తీరును బట్టి చూస్తే తెలుస్తుంది. నోట్ల రద్దు, జిఎస్టీ వల్ల అద్భుతాలు జరిగాయని, ఇంకా జరుగుతాయని మోడీ,ఆయన బృందసభ్యులు గొప్పగా చెప్పు కుంటున్నారు. దానివల్ల లాభనష్టాలు అనుభవిస్తున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ తమ జీవితాలు బాగుపడ్డాయని ఎగిరి గంతేయడం లేదు. అలాగే గతం కన్నా మెరుగైన జీవితాలను అనుభవిస్తున్నామని చెప్పడం లేదు. ఇకపోతే కాంగ్రెస్‌తో బిజెపి తన పాలన గురించి పోల్చుకోరాదు. ఎందుకంటే కాంగ్రెస్‌కన్నా తాము భిన్నమైన వారమని చెప్పు కుంటున్న కమలనాధులు అందుకు భిన్నంగా పాలన అందించివుంటే తృతీయ లేదా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అవసరం ఉండేది కాదు. ఏడేళ్ల తరవాత కూడా ఇంకా కాంగ్రెస్‌ విధానాల గురించి, వారి వైఫల్యాల గురించి మోడీ విమర్శలు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తున్న తీరును బేరీజు వేసుకుంటే బిజెపి పాలనా వైఫల్యాలు కూడా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఏడేళ్లుగా విభజన సమస్యలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాలమే పరిష్కరిస్తుందన్న భావనలో కాలయాపన చేస్తున్నారే తప్ప చొరవ తీసుకుని ముందుకు సాగడం లేదు. కీలక అంశాలను బీజేపీ పట్టించుకోవడం లేదని, ఇంతకాలం ప్రధాని మోడీని నమ్మి వేచిచూశారు. అయినా స్పందించకుంటే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పాలనాపరంగా మోడీ సర్కార్‌ వైఫల్యంగానే దీనిని గణించాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ రాజకీయం చేస్తున్నది తప్ప సమస్యలను అర్థం చేసుకోవడం లేదని గుర్తించాలి. అందుకే కెసిఆర్‌ కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఇలా అన్ని రాష్టాల్ర సిఎంలు గళం విప్పాలి. ఎక్కడో ఒక దగ్గర కేంద్రం పెత్తనంపై చెక్‌ పెట్టాల్సిందే.