ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన సిఎస్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి);  విజిలెన్స్‌ వారోత్సవాలర పురస్కరించుకుని ఉద్యోగులతో సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం నుండి నవంబర్‌ ఒకటవ తేదీ వరకు కొనసాగే విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌పై బీఆర్కే భవన్‌లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రతిజ్ఞ నిర్వహించారు. 75వ స్వతంత్ర భారతం` సమగ్రతతో కూడిన స్వయం సమృద్ధి నినాదంతో ఈ విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవెన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్టేష్రన్ల ఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్‌ సెక్రెటరీ రోనాల్డ్‌ రోస్‌, ప్రోటోకాల్‌ విభాగం జాయింట్‌ సెక్రెటరీ అర్విందర్‌ సింగ్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.