ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ చుక్కెదురు


బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు

ముంబై,అక్టోబర్‌20 జనంసాక్షి : క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో దొరికిన బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ దొరకలేదు. బుధవారం కూడా కోర్టు అతనికి బెయిల్‌ను తిరస్కరించింది. ముంబైకి చెందిన ప్రత్యేక ఎన్డీపీఎస్‌ కోర్టు ఈ కేసులో విచారణ చేపట్టింది. ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మెర్చంట్‌, మున్‌మున్‌ ధంచాలు పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌.. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ముంబైలో ఆర్దర్‌ రోడ్డు జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆర్యన్‌ను అక్టోబర్‌ మూడవ తేదీన ఎన్సీబీ పోలీసులు అరెస్టు చేశారు. క్రూయిజ్‌ షిప్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో మారు దుస్తుల్లో వచ్చిన ఎన్సీబీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. అయితే ఆ తనిఖీల్లో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని ఇవాళ కోర్టు ముందు అతని తరపు లాయర్లు వాదించారు.