తెలంగాణ సరిహద్దుల్లో పూర్తయిన అంత్యక్రియలు
ఖమ్మం,అక్టోబర్‌16  (జనం సాక్షి); మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు`కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. వారంత విప్లవ నేతకు నివాళి అర్పించారు.