వ్యాక్సిన్‌ తీసుకోని వారికి రేషన్‌ కట్‌


ప్రచారాన్ని ఖండిరచిన వైద్యారోగ్యశాఖ

సోషల్‌ విూడియాలో అబద్దలు ప్రచారం చేస్తే చర్యలు
హైదరాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి):  వ్యాక్సిన్‌ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్‌, పింఛన్‌ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని విూడియా సంస్థలు, సోషల్‌ విూడియాలో వస్తున్న ప్రాచారంలో నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరింది.
అలాంటి వార్తలు తప్పని ప్రజా వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తామెక్కవా వ్యాక్సిన్‌కు రేషన్‌, పెన్షన్లకు లింక్‌ పెట్టలేదన్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందేనని అన్నారు. కరోనా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం యధావిధిగా చేయాలన్నార. ఇదిలావుంటే వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని సివిల్‌ సప్లై శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ అనేది వైద్యారోగ్య
శాఖకు సంబంధించిన విషయమని పేర్కొంది. రేషన్‌ కట్‌, పెన్షన్‌ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సివిల్‌ సప్లై శాఖ అధికారులు పేర్కొన్నారు.