ఆలయంలో నగలు,నగదు చోరీ

 రంగారెడ్డి, అక్టోబర్‌26(జనం సాక్షి);  శంషాబాద్‌ మండలం రామంజాపూర్‌ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. దొంగలు స్వామి వారి వస్తులను ఎత్తుకెళ్లారు. ఆలయంలో స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజారి ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయం అప్పటికే తెరిచి ఉండగా.. పూజారి పోలీసులకు సమాచారం అందించారు. టెంపుల్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.