’అమ్మఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలి


పిల్లలంతా బడి బాట పట్టాల్సిందే

తల్లిదండ్రులను చైతన్యం చేయాలి
కోట్లు వెచ్చించి స్కూళ్లను బాగు చేస్తున్నాం
స్కూళ్ల నిర్వమణపై సిఎం జగన్‌ సవిూక్ష
అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ’అమ్మఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలని అధికారులకు సిఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమన్న సీఎం... ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం అని వివరించారు. విద్యాకానుకను అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దాం అని జగన్‌ వివరించారు. అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలి అని ఆయన కోరారు. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టాం అని తెలిపారు. తిరుమల పర్యటనకు వెళ్ళే ముందు సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం వైయస్‌. జగన్‌ సవిూక్ష నిర్వహించారు. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి,విద్యా కానుకపై అధికారులతో సీఎం విస్త్రృత చర్చ జరిపారు సిఎం వైఎస్‌ జగన్‌. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్న సీఎం... అధికారులకు పలు కీలక సూచనలు చేసారు. విద్యార్థుల హాజరుపైనా సీఎం ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు వివరించారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్న అధికారులు... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి...ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని జగన్‌ కు వివరించారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ... కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంది అని వివరించారు. రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిరది అని తెలిపారు. అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకునే పరిస్థితులు వచ్చాయి అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాం, మార్చి చివరి వారంలో కోవిడ్‌ ప్రారంభం అయ్యింది అని వివరించారు. అమ్మ ఒడి అమల్లోకి వచ్చిన 2`3 నెలలు తిరగకముందే కోవిడ్‌ ప్రారంభం అయ్యింది, స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది అని తెలిపారు.