రెండోరోజూ కొనసాగిన చంద్రబాబు దీక్ష

మద్దతుగా జిల్లాల నేతలు భారీగా తరలిరాక

అధికార పార్టీ తీరుపై మండిపడ్డ నేతలు
అమరావతి,అక్టోబర్‌22  జనంసాక్షి:  టిడిపి కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు దీక్ష
రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. తొలిరోజు ఆయన రాత్రి పదిన్నర వరకు దీక్షలో కూర్చుకుని అక్కే నిద్రకు ఉపక్రమించారు. రెండోరోజు శుక్రవారం వివిధ జిల్లాల నుంచి వేలాదిగా నేతలు తరలివచ్చి మద్దతుఉ పలికారు. జగన్‌ సర్కార్‌ తీరుపై పలువురు విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటవిక పాలనలో ఉన్నామా?, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పరిటాల రవిని పట్టపగలు చంపారు, ఎవరు కారణమని నిలదీశారు. ‘తండ్రిని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నావు కానీ హత్య, ఫ్యాక్షన్‌ రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య‘ సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏపీ గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుందని తెలంగాణ పోలీసులే చెప్పారన్నారు. తెలంగాణ పోలీసులపై కేసులు పెట్టగలరా? ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాదులు రాష్టాన్న్రి నాశనం చేశారని చౌదరి విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాలో ప్రవహించేది సీమ రక్తమేనని అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని... ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని అన్నారు. చంద్రబాబు తీరు మారాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత హెచ్చరించారు. ఇకపోతే ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే జగన్‌ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అదోగతిపాలైందన్నారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్‌ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని అన్నారు. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులందరూ ప్రక్క రాష్టాల్రకు పారిపోతున్నారని టీడీపీ నాయకురాలు దివ్యవాణి పేర్కొన్నారు. 36 గంటల దీక్షలో దివ్యవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువకులకు ఉద్యోగాలు లేవు. రోడ్లు సరిగా లేవు. ఒక్క ఛాన్స్‌తో వచ్చి ప్రజలను మోసం చేసినందుకు జగన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అమరావతి రైతులను రోడ్లపై కూర్చోబెట్టినందుకు జగన్‌ క్షమాపణ చెప్పాలి. లోకేష్‌గారి, చంద్రబాబు నాయుడిగారి ఆధార్‌లు చింపేస్తామన్న వైసీపీ వాళ్లు నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. మిగిలిన రెండేళ్లలో రాష్టాన్న్రి అభివృద్ధి చేసి చూపిస్తే జగన్‌ రెడ్డి నాయకుడని ఒప్పుకుంటామని పేర్కొన్నారు.