సమస్యలు పరిష్కరించంది

మంత్రికి పంచాయితీ ఉద్యోగుల వినతి

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి):  తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ`పంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు విన్నవించారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలతో కూడిన విజ్ఞానపను అందచేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలని, పిఆర్‌ సి ప్రకారం కనీస వేతనాన్ని పెంచాలని, తమని పంచాయతీ కార్యదర్శులకు సహాయకులుగా పరిగణించాలని, హెల్త్‌ కార్డులు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బంగారు తెలంగాణలో భాగమై పని చేస్తున్న తమకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని వారు మంత్రి ని కోరారు.