ఘాట్‌రోడులో జెసికి అవమానం

కారులో రావడంతో అనుమతించని పోలీసులు

విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : ఇంద్రకీలాద్రిపై జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌కు అవమానం జరిగింది. ఇంద్రకీలాద్రిపై దసరా పనులను పర్యవేక్షించేందుకు కారులో ఘాట్‌ రోడ్డు విూదుగా వచ్చిన ఆయన కారును పోలీసులు ఆపేశారు. తాను జేసీనని ప్రస్తుతం దసరా పనుల ఇన్‌చార్జ్‌నని కారు దిగి వచ్చి చెప్పినా అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ వినిపించుకోలేదు. పోలీసుల తీరుపై జేసీ సీరియస్‌ అయ్యారు. సీపీకి ఫిర్యాదు చేశారు. ఆ సీఐపై యాక్షన్‌ తీసుకుంటామని సీపీ హావిూ ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ జేసీ శివశంకర్‌ కాలి నడకన ఘాడ్‌ రోడ్డు విూదుగా వచ్చి మార్గం మధ్యలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.