ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం దిశగా పయనిస్తున్నాయి. తల్లిదండ్రుల దృక్కోణంలో మార్పు కనిపిస్తోంది. కరోనా సంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. ఎపిలో సర్కార్ బడులను అందంగా తీర్చిదిద్దారు. తెలంగాణ లో కూడ ఆబడులను స్థానిక సంస్థలకు అప్పగించి శుభ్రం చేయించారు. కోరానా జాగ్రత్తలతో స్కూళ్లు నడుస్తున్న తీరు ఊర్వ వైభవాన్ని గుర్తుకు తెస్తోంది. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలపై మోజు తగ్గిన తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లల వైపుదారి మళ్లించడం శుభసూచకంగా మారుతోంది. ఫీజుల మోత తగ్గించుకునే ప్రయత్నాల్లో తల్లిదండ్రులు చాలాచోట్ల సర్కార్ బడులను ఆశ్రయిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ భయం కారణంగా చాలాచోట్ల ప్రైవేటు పాఠశాలలు తరగతులను ప్రారంభించేందుకు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా భయంతో పిల్లలను ఇతర ప్రాంతాల్లో ఉంచేందుకు తల్లిదండ్రు లు ఇష్టపడకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించారు. అంతేకాకుండా కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురైన తల్లిదండ్రులు సైతం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. గురుకు లాల ప్రారంభానికి సైతం హైకోర్టు అనుమతినివ్వడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా సమయంలోనూ ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు ముక్కుపిండి ఫీజులను వసూళ్లు చేశాయి. ఇప్పుడు స్కూళ్లు తెరిచాక కూడా చాలాచోట్ల ఫీజులను పెంచారు. ఈ క్రమంలో తల్లిదడండ్రులు అంతంత మాత్రంగా ఉన్న సంపాదన నుంచి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో చాలాచోట్ల సర్కార్ స్కూళ్లలో ఫీజులు లేపోవడంలో అక్కడే తమ పిల్లలను చేర్పించారు. దీనికితోడు మధ్యాహ్న భోజనం కూడా కలసివస్తోంది. నాణ్యమైన బోజనం పెట్టడంతో తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకున్నారు. ఎపిలో ఇంగ్లీష్ విూడియం కూడా కలసి వస్తోంది. గతానికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతంగా అడ్మిషన్‌లు పెరిగిపోతున్న కారణంగా ఆ పాఠశాలలకు కొత్తవైభవం చేకూరుతోంది. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు తమ పాఠశాలలను రక్షించుకునేందుకు ముందుకు రావడమే కాకుండా ప్రవేశాల పెరుగుదలకు ఆ తరువాత మెరుగైన భోధన అందించేందుకు ముందుకు రావడం విద్యారంగంలో కొత్త పరిణామం. క్రమంగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పడిపోయి సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగిన కారణంగా విద్యార్థులు పోటీ పడి చదువులు సాగించే అవకాశం ఏర్పడిరదని అధ్యాపకులు కూడా అంటున్నారు. అధికారులు కూడా ఓ వైపు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడం, అలాగే విద్యార్థులకు అందుతున్న బోధన తీరును స్వయంగా పరిశీలించడం, దీంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీ లించడం లాంటి చర్యలు చేపట్టారు. నిరాటకంగా తనిఖీలు జరిపి పాఠశాలల్లోని లోటుపాట్లను స్వయంగా తెలుసుకుంటున్నారు. అలాగే పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో కూడా సమావేశమై బోధనను మెరుగు పర్చాలని, విధులపట్ల నిర్లక్ష్యం చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినా పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్ధుబాటు చేసి బోధనకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతీరోజూ పాఠశాలల పనితీరును తెలుసుకుంటూ దానికి అనుగుణంగా సలహాలు, సూచనలు అందించడంతో టీచర్ల పనితీరులో సైతం మార్పు కనిపిస్తోంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పూర్తిగా గాడిన పడడం, అలాగే ప్రైవేటు
పాఠశాలలకు ధీటుగా బోధన కొనసాగు తున్న నేపథ్యంలో సర్కారు విద్యారంగం పూర్వకళకు చేరువ వుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇది లా ఉండగా పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు సరిపోక ప్రధానసమస్యగా మారుతోంది. ప్రస్తుతకీలక సమయంలో టీచర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖదేనన్న వాదనలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా విద్యా వలంటీర్ల నియామకం చేపట్టాలంటూ అటు ఉపాధ్యాయసంఘాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విద్యా వలంటీర్ల నియామకం విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పందన వెలిబుచ్చడం లేదు.దీంతో పాటు అనేక పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కూడా లేకపోవడం కొంత ఇబ్బంది కరంగా మారుతోందంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని పాఠశాలల్లో గదులు సరిపోక పోవడంతో ఆవరణలోనే పాఠాలు బోధిస్తున్నారు. అలాగే తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతు న్నాయి. దీనికి విద్యార్థుల నమోదు గణనీయంగా పెరగడమే సాక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభగల టీచర్లు ఉన్న కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇటువైపు మొగ్గుచూపుతుండడం మంచి పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన అందించడమే కాకుండా మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి తెస్తున్నారు. పకడ్భందీగా పాఠ్య ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థులసంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి వారిని సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయుల నియామక పక్రియ జరిగే వరకు తాత్కాలిక ప్రాతిపాదికన విద్యా వాలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీంతో పాటు చాలా పాఠశాలల్లో కనీ సం మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయన్న విమర్శలున్నాయి. సౌకర్యాల లేమితో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా కొన్ని పాఠశాలల్లో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందనే అంశం ఒకవైపు సంతోషం కలిగిస్తుండగా.. సమస్యలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, విద్యా వలంటీర్ల కొనసాగింపు, మౌలిక సదుపా యాల కల్పన తదితర విషయాలు కలవరపెడుతున్నాయి. గతంలో నియమించిన విద్యా వలంటీర్లను ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే మళ్లీ మంచి రోజులు రాగలవని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సర్కార్ బడులకు మళ్లీ మహర్దశ !