బిఎ హానర్స్‌ కోర్సుల ప్రవేశం ఉన్నతవిద్యామండలి ఆమోదం

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): బిఏ చదవాలనుకునే వారికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీపి కబురు చెప్పింది. ఢల్లీిలోని యూనివర్శిటీలకే పరిమితమైన హానర్స్‌ కోర్సులను తెలంగాణలో పరిచయం చేయబోతోంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సులకు మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది. బిఏ చదివాను అని గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. బిఏ కోర్సులకు మరోసారి డిమాండ్‌ పెరగబోతోంది. మరుగున పడుతున్న పాతతరం బిఏకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్త లుక్‌ తేబోతోంది. హానర్స్‌ కోర్సును ప్రయోగాత్మకంగా నాలుగు కాలేజీల్లో 60 చొప్పున సీట్లు కేటాయించారు. దీంతో ఈ కోర్సులకు బాగా డిమాండ్‌ పెరిగింది. బిఏలో ఇప్పటి వరకు ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్టేష్రన్‌, హిస్టరీ కోర్సులు మాత్రమే ఉండేవి. ఇందులో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులనే ప్రామాణికంగా తీసుకుని మొత్తం మూడేళ్లపాటు వాటివిూదే స్టడీ చేసే విధంగా హానర్స్‌ కోర్సులను ఈ ఏడాది నుంచే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టింది.