వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం

  


హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్‌ జనరల్‌

హైదరాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి):   సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్‌ రామిరెడ్డి రాజీనామా వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్‌ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్‌ సింగ్‌, జే.శంకర్‌ హైకోర్టులో పిల్‌ ధాఖలు చేశారు. కాగా... ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్‌ పక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్‌ వెనక్కి తీసుకున్నారు. అలాగే వరి విత్తనాల అమ్మకూడదంటూ వెంకట్‌ రామి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్‌ కంప్లయింట్‌లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డితో బేషరత్‌గా క్షేమపణల స్టేట్మెంట్‌ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.