కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా!?

 



` బిల్లులకు మద్ధతు ఎలా తీసుకున్నారు
` రైతులతో కలిసి 12న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా
` పిట్ట బెదిరింపులకు భయపడం
` ధాన్యం కొంటారా లేదా చెప్పండి
` రైతులకు మద్దతుగా ఇక కొట్లాడుతాం
` దమ్ముంటే ధాన్యం కోసం పోరాటంలో కలసి రావాలి
` దేశంలో సహజ వనరుల వినియోగంలో విఫలం
` బండి సంజయ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటు హెచ్చరిక
` దళితబంధు యధాతథంగా అమలు..
` ఆ పథకంపై అనుమానాలే వద్దన్న సీఎం
హైదరాబాద్‌,నవంబరు 8(జనంసాక్షి):అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సోమవారం విూడియాతో మాట్లాడారు.‘‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్‌.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? భాజపానే నియమించిన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆ పార్టీకి చెందిన వరుణ్‌ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్‌ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.‘‘పంజాబ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనిపై సమాధానం చెప్పేదాకా.. కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టం. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈ రోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ రాయలసీమకు నీళ్లివ్వాలని చెప్పా. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? బండి సంజయ్‌ యాసంగిలో వడ్లు వేయాలని చెప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు పెడతా. బండి సంజయ్‌, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడ అని బండి సంజయ్‌ ప్రశ్నిస్తున్నారు. అసలు ఉద్యమంలో ఆయనెక్కడ ఉన్నారు? ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు నీ పేరైనా తెలుసా?. భాజపా నేతల కథ తేల్చేదాకా నేను రోజూ మాట్లాడతా. ఇకపై రోజూ కేసీఆర్‌ ప్రెస్‌విూట్‌ ఉంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దేశద్రోహులమా?’’ అని కేసీఆర్‌ అన్నారు.తాము ఉద్యమకారులమని...ఉద్యమం నుంచి పుట్టుకుని వచ్చిన వారమని ..అందువల్ల ఎవరి పిట్ట బెదరింపులకు భయపడేది లేదని సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇక పోరాడుతామని కాచుకోవాలని సవాల్‌ చేశారు.కేంద్రంపై సీఎం కేసీఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను ఉతికారేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనను అని చెబుతున్నావ్‌. ఇది నీ చేతకాని తనం కాదా? కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపడుతాం. లక్షలాది మంది రైతులతో కలిసి ధర్నాలు చేయబోతున్నాం. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలాలి. రైతులతో కలిసి పోరాడుతాం. శుక్రవారం మాతో కలిసి నువ్వు కూడా ధర్నాకు కూర్చుంటావా? తెలంగాణలో పండిరచిన ధాన్యాన్ని కొనాల్సిందే అని కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. విూ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది. ఈ దేశం విూ అయ్య సొత్తు కాదు. మిమ్మల్ని వదలం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనే వరకు పోరాడుతాం. విూరు వడ్లు కొనం అంటే విూకు ఓటేయ్యాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతున్నారు. విూరు డిపాజిట్లు కోల్పోయారు అని కేసీఆర్‌ గుర్తు చేశారు. దేశంలో సంస్కరణలు రావాలని, అద్భుతాల ఆవిష్కరణలు రావాలన్నారు. విద్యుత్‌ వినియోగం, నీటి వినయోగంలో వెనకబడి ఉన్నామని అన్నారు. మనదగ్గర ఎన్నో వనరులు ఉన్నా వాటిని ఉపయోగించు కోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణలో పండిరచిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం రైతులతో కలసి ప్రతినియోజకవర్గంలో ధర్నా చేస్తామని అన్నారు. ధాన్యం ఎంత కొంటావో చెప్పాలి. పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా సీదా అడుగుతున్నా. సమాధానం చెప్పే వరకు బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టం.ప్రజల కోసం ఉద్యమించిన వ్యక్తిగా, రాష్టాన్న్రి సాధించిన వ్యక్తిగా, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. బీజేపీ నాయకుల్లాగా చీప్‌గా ప్రవర్తించాం. పెద్ద ఎత్తున రైతులతో కలసి పోరాడుతామని, దమ్ముంటే తనతో కలసి రావాలని బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని బండి సంజయ్‌ను కేసీఆర్‌ మరోమారు హెచ్చరించారు. నిలదీస్తే దేశద్రోహులని ముద్ర వేయడం బిజెపికి అలవాటయ్యిందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో పరిపాలన చేస్తున్నాం. విూలాగా దొంగ లెక్కలు చేయలేదు. కర్ణాటకలో విూరు ప్రజాతీర్పును శిరసా వహించలేదు. గవర్నమెంట్‌ను కూలగొట్టి దొడ్డిదారినా బీజేపీ గవర్నమెంట్‌ నడుస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా విూ పరిస్థితి అంతే. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర విూది దీనిపై విూ సమాధానం ఏంటి? ఇది అప్రజాస్వామ్యం కాదా? దీనిపై మాట్లాడితే తప్పా? తెలంగాణలో 107 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు పోయాయి. నాగార్జున సాగర్‌లో కూడా డిపాజిట్‌ పోయింది కదా దీనిని కాదంటారా అని ప్రశ్నించారు. చాలా భయంకరంగా విూకు లొంగి ఉండి, విూరు చెప్పింది వింటే వారు మంచోళ్లు.... దేశభక్తులు. విూరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపితే దేశ ద్రోహులు అయిపోతారు. ఆ తర్వాత ఐటీ దాడులు చేయిస్తారు. అన్యాయంగా కేసులు పెడుతారు. ఇక్కడ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని సిఎం ప్రగతి భవన్‌లో విూడియా సమక్షంలో హెచ్చరించారు. బండి సంజయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. మా హద్దులు మాకు తెలుసు. నేను హద్దు విూరి మాట్లాడలేదు. వడ్లు కొంటారా? లేదా ? అంటే హద్దు విూరి మాట్లాడినట్టా? ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. స్థానిక సంస్థల నుంచి శాసనసభ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ గెలిచింది. బీజేపీ పార్టీకి తెలంగాణలో అడ్రస్‌ లేదు. జీహెచ్‌ఎంసీలో మా కంటే చాలా తక్కువ గెలిచి కూడా పెద్ద ఫోజు కొట్టిండు. అడ్డగోలుగా మాట్లాడి, తప్పుడు మాటలు చెప్పి నాలుగైదు సీట్లు గెలిచారు. 2001 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగు లేకుండా విజయం సాధించింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్‌ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మిగతా విషయాలన్ని మాట్లాడిరడు. వడ్ల గురించి మాట్లాడకుండా.. సొల్లు పురాణం మాట్లాడిరడని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దీన్ని బట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖరి వీడట్లేదు. రైతుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. మద్దతు ఇచ్చినప్పుడు దేశద్రోహులం కాదు. పలు బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు దేశ ద్రోహులం కాదు.. గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన నిలదీస్తే.. వాళ్లు దేశద్రోహులు. ఇది బీజేపీ స్టైల్‌. దేశంలో ఎవరూ నిలదీసినా.. ఉన్న విషయాలు కుండబద్దలు కొడితే వారు దేశద్రోహులు అయిపోతారు. రెండు, మూడు రకాలు స్టాంపులు తయారు చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్‌ నక్సలైట్‌.. ఇవన్నీ దేశంలో పరంపర కొనసాగుతున్నాయి.మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకం అని మాట్లా డారు. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా రైతులకు సంఫీుభావం తెలిపారు. చట్టాలను ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. మేఘాలయ గవర్నర్‌, వరుణ్‌ గాంధీ కూడా దేశ ద్రోహులేనా? దేశం దురాక్రమణ జరగకూడదు. దాన్ని నిరోధించాలని చెబితే దేశ ద్రోహి అంటున్నారు. కేసీఆర్‌ చైనాలో డబ్బులు దాచుకున్నాడంటా? ఒక తల తోక లేదు. ఇష్టం వచ్చిన సొల్లును, ఇష్టం వచ్చినట్టు గుమ్మరించి మాట్లాడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్‌ ఓటేయలేదు అని బండి సంజయ్‌ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ పత్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు. కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే నడవనివ్వను. తెలంగాణకు ఏం చేసినావో చెప్పు అంటడు ఈ మొగోడు. తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందుతోంది. నీ ఇంటికి కూడా మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా? దేశాన్ని నడిపే పార్టీ అధ్యక్షుడు.. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. గొర్రెల పైసల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నేషనల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక. అబద్దాలు మాట్లాడటం సరికాదు. బీజేపీ పాలిత రాష్టాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. బీజేపీ పాలిత రాష్టాల్లో షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని కేసీఆర్‌ మండిపడ్డారు.
దళితబంధు యధాతథంగా అమలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు అవుతోందని కూడా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతోంది. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశాం. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం. దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. తెలంగాణ దళిత జాతిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే. హుజూరా బాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేసి తీరుతాం. మిగతా నాలుగు మండలాల్లో కూడా నేనే స్వయంగా వెళ్లి.. 100 కుటుంబాల చొప్పున అమలు చేస్తాం. మిగతా నియోజకవర్గాల్లోనూ నియోజక వర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తాం. ఈ పక్రియ మార్చి లోపు అమల వుతోంది. వచ్చే మార్చి లోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తిస్తాం. తెలంగాణ దళితజాతి అభివృద్ధి ఏడాది, రెండేండ్లో చేసి చూపిస్తాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.కేంద్రంతో ఘర్షణ ఎందుకని ఇన్నాళ్లూ సర్ధుకుపోయా మన్నారు. కానీ రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే సహించమని, రైతులతో కలిసి పోరాడతామన్నారు. బీజేపీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల్లో యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్‌ రెడ్డి పారిపోయిండు. నిజామాబాద్‌ ఉప ఎన్నికకు వెళ్లి యెండల తరపున ప్రచారం చేశాం. ఆవేశంగా మాట్లాడుతున్నాను. జేఏసీ పిలుపునిచ్చిన కూడా కొందరు దద్దమ్మలు పారిపోయిండ్రు అని అన్నాను. ఒకరిద్దరు పిల్లలు విూ పక్కనే ఒక దద్దమ్మ ఉన్నడు అని చెప్పిండ్రు. అప్పుడు నా పక్కనే కిషన్‌ రెడ్డి ఉన్నడు. మేం దద్దమ్మలం కాదు. పదవులను చిత్తుకాగితాల్లాగా విసిరికొట్టినం. ఎన్నో రాజీనామాలు చేశాం. అలా ఉద్యమం చేసి రాష్టాన్న్రి సాధించుకున్నాం. ఆర్థిక ప్రగతిలో ముందు వరుసలో ఉన్నాం. ఇండియా మొత్తంలో కరోనా వస్తే ప్రయివేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే. కర్ణాటకలో ప్రయివేటు టీచర్లపై లాఠీఛార్జి చేయించారు. కూలీలను కూడా ఆదుకున్నాం. 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, కూలీలను కడుపులో పెట్టుకుని వారి సొంత ఊర్లకు పంపించాం. కూలీలను గౌరవించింది మేం. కూలీలు టీఆర్‌ఎస్‌ జిందాబాద్‌ అని జై కొట్టారు. పిచ్చి రాజకీయాలు చేసేదీ విూరు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచంలో రాకెట్‌ వేగంతో దూసుకొస్తున్న రంగం ఎలక్ట్రికల్‌ మోటార్స్‌ రంగం అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. చైనీస్‌కు చెందిన ఎంజీ అనే కంపెనీ నుంచి ఈ మధ్యనే నేను ఓ ఎలక్ట్రిక్‌ కారు కొన్నాను. ఈ సందర్భంగా వారు నాతో ఓ ఫోటో కూడా దిగివెళ్లారు. హైదరాబాద్‌లో ఎంజీ ఎలక్టిక్ర్‌ కార్లు వచ్చేసినయ్‌. స్కూటీలు వేలకొద్ది అమ్ముడుపోతున్నాయి. మూడు, నాలుగు నెలలుస్కూటీలు వెయిటింగ్‌లో ఉన్నాయి. కొద్ది సంవత్సరాల్లో పెట్రోల్‌ బంక్‌లు పోయి, ఛార్జింగ్‌ బంక్‌లు వస్తాయి. త్వరలోనే చూడబోతున్నాం. కార్ల సేల్స్‌ అత్యధికంగా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 150 నుంచి 200 కార్లు అమ్మారు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దే9శంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారనమంతా మారాలన్నారు. ఎంతసేపు ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం కాదని బిజెపిని ఎద్దేవా చేశారు.
గట్టిగా మాట్లాడితే అర్బన్‌ నక్సలైట్లు అంటారు
తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. తనను దేశద్రోహి అన్న బీజేపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులు కాదు. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా మేము దేశద్రోహులు కాదు. కానీ ఇప్పుడు దేశద్రోహులం అయ్యాం. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు. అంటే బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా? ఇది బీజేపీ స్టయిల్‌. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని నిలదీసినా వాళ్లు దేశద్రోహులు అయిపోతారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుంది. ఒకటి దేశద్రోహులు. రెండు అర్బన్‌ నక్సల్స్‌. ఇంకా గట్టిగా మట్లాడితే అర్బన్‌ నక్సల్స్‌ స్టాంప్‌ వేస్తారని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. బీజీపీలా టీఆర్‌ఎస్‌ నీచంగా ప్రవర్తించబోదని కేసీఆర్‌ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటామని తెలిపారు.

 

(త్వరలో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఏటా ఉద్యోగ క్యాలెండర్‌)
` నిరుద్యోగులను ఆదుకుని తీరుతాం
` కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు నియామకాలు
` విూడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌ వెల్లడి
హైదరాబాద్‌,నవంబరు 8(జనంసాక్షి): తెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల విషయంలో పారద్శకంగా ఉంటామని, ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం జరిగిన విూడియా సమావేశంలో ప్రకటించారు. త్వరలోనే 60`70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని అన్నారు. జోన్ల వారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు. చిల్లరమల్లర విమర్శనలు నిరుద్యోగులు పట్టించుకోవద్దని కూడా అన్నారు. తాము నిరుద్యోగులకు అండగా ఉన్నామని, ఇప్పటి వరకూ లక్షా ముప్ఫైఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి మేలు చేసిందో చెప్పాలని ఆ పార్టీకి సవాలు విసిరారు. తమ పాలనలో నిరుద్యోగులకు ఇప్పటి వరకూ ఇచ్చిన ఉద్యోగాలే కాకుండా, మరో 70`80 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడిరచారు. తాము గోల్‌మాల్‌ లెక్కలు చెప్పలేదని, రాష్టాన్న్రి కష్టపడి తెచ్చుకున్నం, దాన్ని సవరించాలి అని ఆలోచించినట్లు కేసీఆర్‌ చెప్పారు. దానికోసమే కొత్త జోనల్‌ చట్టాన్ని తీసుకొచ్చామని, దాన్ని ఆమోదించడానికి 6`7 నెలలు తమను సతాయించారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ చట్టం ఆవశ్యకతను వివరిస్తూ పదిసార్లు తిరిగితే ఇటీవల దానికి ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ చట్టం ప్రకారమే ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నామని వివరించారు. ’పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేశాం. ప్రభుత్వ శాఖలన్నింటినీ రీఆర్గనైజ్‌ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. మేం తెచ్చిన జోనల్‌ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా. ఉన్న ఉద్యోగులంతా ఎక్కడి వారు అక్కడ అడ్జస్ట్‌ అయిన తర్వాత జిల్లాల వారీగా ఏ జిల్లా వారికి అక్కడే ఖాళీలు దొరుకుతాయి’ అని తెలియజేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల యువకులకు ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశ్యంతోనే పరిపాలనా సంస్కరణలు, జోనల్‌ వ్యవస్థలు తెచ్చామన్నారు. ఉద్యోగుల అడ్జస్ట్‌మెంట్‌ పూర్తయితే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని, ఇటీవల తాము వేసిన అంచనా ప్రకారం 60`70 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.’ఉద్యోగాల విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పా. చేయగలిగిందే చెప్తాం తప్ప గోల్‌మాల్‌ మాటలు మేం చెప్పం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని, ఏటా కోటి ఉద్యోగాలు నాశనం చేస్తూ వచ్చిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.