కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

బెంగళూరు,డిసెంబర్‌10 జనంసాక్షి:  కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని.. అలాగే పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. నాలుగైదు రోజుల కిందట విద్యార్థులు శివమొగ్గలో పరీక్షలు రాసేందుకు వెళ్లి వచ్చారని..ఆ తర్వాత పలువురికి కరోనా లక్షణాలు కనిపించాయని జిల్లా సీనియర్‌ అధికారి తెలిపారు. అందరికీ కరోనా పరీక్షలు చేయించామని చెప్పారు. కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ హోం ఉందని, దీంతో అక్కడి రోగులను ఇతర  ఆస్పత్రులకు  తరలించామని అన్నారు. కాలేజీతో  పాటు ఆస్పత్రిని కూడా మూసివేయించామన్నారు.