తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9 కి ప్రత్యేకంట్వీట్‌ చేసిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనం సాక్షి ): తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9వ తేది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్న్రి  ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్‌ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్‌ పేజీలో ప్రచురితమైన వ్యాసాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో కేటీఆర్‌ షేర్‌ చేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో.. అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నేడేండ్లు పూర్తయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.. శీర్షిక పేరున నమస్తే తెలంగాణ దినపత్రికలో విూడియా అకాడవిూ డైరెక్టర్‌ అల్లం నారాయణ రాశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణకు కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.