హైదరాబాద్,డిసెంబర్9(జనంసాక్షి ): డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహత్తరమైన రోజు అని మంత్రి కొప్పుల తన ప్రకటనలో పేర్కొన్నారు.ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర ప్రకటన సాధించిన శుభ దినం అని మంత్రి తెలిపారు. కేసీఆర్ వెన్నంటి ఉండి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వాసులు, దేశ, విదేశాలలోని తెలంగాణ బిడ్డలందరికి కొప్పుల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం : మంత్రి కొప్పుల