నేడు నిరుద్యోగదీక్ష

 ` బండి సంజయ్‌
హైదరాబాద్‌,డిసెంబరు 26(జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ కోసం భాజపా నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షకోసం తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరునున తీవ్రంగా ఖండిరచారు. ‘‘నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్‌ నియంత, అహంకార పాలనకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉద్యో?గాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌ కళ్లకు కనిపించడం లేదు. ఉద్యోగం, ఉపాధి కరవై లక్షలాది మంది యువత అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిరచాలి. నిరోద్యగ యువతీ, యువకుల పక్షాన భాజపా చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరుతున్నా’’ అని బండి సంజయ్‌ తెలిపారు.బండి సంజయ్‌ రేపు తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో చిన్న మార్పు చేశారు. దీక్షను ముందుగా ప్రకటించినట్టుగా ఇందిరాపార్కు వద్ద కాకుండా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి మార్చినట్టు వెల్లడిరచారు. భాజపా కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్టు సంజయ్‌ ప్రకటించారు.