ఒమైక్రాన్‌ భయాలు.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు

వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఒమైక్రాన్‌ భయాలు..థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఇంటింటికి వెళ్లి సూచించారు.  కరోనాతో పాటు కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. మహిళలు, యువతులు ముందుకు వచ్చి తమ కుటుంబాలను చైతన్యం చేయాలన్నారు. కరోనా దృష్ట్యా మహిళలు చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. కరోనా నివారణ కోసం వైద్య శాఖ సిబ్బంది గ్రామంలో పర్యటిస్తూ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందక ముందే కరోనా వ్యాక్సినేషన్‌ మొదటి, రెండో డోస్‌ వంద శాతం పూర్తి చేయాలని అధికారనులను ఆదేశించామని అన్నారు. గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్‌పై ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ తప్పనిసరి వేసుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ నెలాఖరుకల్లా వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని కోరారు. మరోవైపు  గ్రామాల్లో చేపడుతున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు.