జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న కుర్మ మౌనిక అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నేపాల్‌లో జాతీయ స్పోర్ట్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి జనవరి 2 వరకు పోటీలు జరుగనున్నాయి నవంబర్‌లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడి ప్రతిభ చూపిన మౌనిక అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. పోటీల్లో పాల్గొనడానికి దాతలు ఎవరై న ముందుకు వచ్చి ఆమెకు ఆర్థిక సహయం చేయాలని కోరుతున్నారు. ఇకపోతే జాతీయ స్థాయి జూనియర్స్‌ వాలీబాల్‌ పోటీలకు ఎస్‌ఆర్‌ ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని కడావత్‌ పావనీ ఎంపికైంది. జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు కోల్‌కత్తాలోని బుర్ద్వాన్‌లో డిసెంబర్‌ 25 నుంచి 30వ తేది వరకు ఉన్నాయన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.