తిరుమల,డిసెంబర్6 (జనంసాక్షి); సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,స్నేహలత దంపతులు సోమవారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రితో పాటు కోరుట్ల ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు, పలువురు ప్రముఖులు కూడా వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల తెలంగాణ రాష్ట్రం, ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నారు.