సోషల్‌ విూడియా యాక్టివిస్త్‌ సంతోష్‌ అరెస్ట్‌ దారుణం

భార్యను ఆస్పత్రిలో చేర్చడానికి వస్తే అరెస్టా: లోకేశ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  సోషల్‌ విూడియా యాక్టివిస్ట్‌ యల్లపు సంతోష్‌ నిండు గర్భిణి అయిన భార్యని ఆస్పత్రిలో డెలివరీ కోసం చేర్చగా, ఉగ్రవాదిలాగ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఫాలో అవ్వకుండా వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూసేందుకు సీఐడీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. సంతోష్‌, ఆయన భార్యకి ఏమి జరిగినా పూర్తిగా సీఐడీదే బాధ్యత అన్నారు. కడుపు మండి సోషల్‌ విూడియాలో పోస్టు పెడితే అరెస్టులా అంటూ సీఎం జగన్‌రెడ్డి గతంలో విస్తుబోయారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తాబేదార్లు.. సోషల్‌విూడియాలో పోస్టులు పెట్టే యాక్టివిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్టు చేయిస్తారా? అని నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.