అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌,బిజెపిల లక్ష్యం

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: మంత్రి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. బిజెపి కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలన్నారు.  కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. తెలంగాణలో మరో 20 ఏండ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. కేసీఆర్‌ చేపట్టే పథకాలే ఆయనకు శ్రీరామ రక్ష అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యవసాయం పండుగలా మార్చారని అన్నారు. అన్నదాత ఆనంద పడేలా పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని  అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసే ఆరోపణలన్నీ  ప్రగల్బాలేనని విమర్శించారు. కొడంగల్‌కు ఏవిూ చేయని రేంవత్‌ రెడ్డి ఇప్పుడు కెసిఆర్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. ఆయన తన స్థాయిని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు జిల్లా రైతుల ముఖంలో నవ్వులు పూస్తాయన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా గత పాలకులు కనీసం ప్రజల గొంతు తడపలేకపోయారని విమర్శించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంతో పాలమూరు కరువు గోసను పూర్తిగా రూపుమాపడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ఒక మహోన్నత కార్యక్రమమన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ప్రజలకు ఫ్లోరైడ్‌ భూతం నుంచి బయటపడుతారన్నారు. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాన్నారు. గ్రామాల్లో గతులకు రోడ్లకు కాలం చెల్లిందని చెప్పారు. గ్రామాల్లోని రోడ్లు అద్దంలా తయారయ్యాయని తెలిపారు. ఇదిలావుంటే  కడుపులో బిడ్డపడ్డప్పటి నుంచి తల్లీ బిడ్డల సంక్షేమం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాతాశిశు మరణాల రేటును తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గర్భిణులకు కాన్పు సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టా రన్నారు. ప్రభుత్వ దవాఖానలలో గర్భిణులకు వైద్యసేవలందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింన్నారు.