ఎంపీలకు మోదీ గట్టిగానే వార్నింగ్
న్యూఢల్లీి,డిసెంబర్7 (జనంసాక్షి) : బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. విూరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు రెగ్యులర్‌గా అటెండ్ కావాలని ఆయన కోరారు. ప్రతిసారి ఈ విషయంలో విూపై వత్తిడి తీసుకురావడం సరిగా లేదని, పిల్లల తరహాలో ట్రీట్ చేయలేమని, విూరు మారకపోతే, అప్పుడు క్రమంగా మార్పులు జరుగుతాయని ఆయన అన్నారు. శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్‌పై విపక్షాల నుంచి వత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక రాబోయే ఏడాది పలు రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనూ ఆయన ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.