పెళ్లయిన యువతితో ప్రేమాయణం

విషాదంగా ముగిసిన యువకుడి జీవితం

జయపుర,డిసెంబర్‌16 (జనం సాక్షి):   పెళ్లయిన ఒక యువతితో లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న 29 ఏళ్ల యువకుడు మోప్‌ాసిన్‌ ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఆమెకు అప్పటికే పెళ్లయి, ఒక కుమార్తె కూడా ఉంది. అయినా సరే ఇద్దరూ ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి ఎవరూ ఒప్పుకోరని తెలిసి పారిపోయారు. యూపీకి చెందిన అతను ఆమెతో రాజస్థాన్‌ చేరుకున్నాడు. జైపూర్‌లో ఒక ప్లాట్‌ అద్దెకు తీసుకొని కలిసే ఉంటున్నారు. తనను వదిలేసి రావడంతో యువతి భర్త.. తన భార్య కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాడు. ఇలా వీళ్లు జైపూర్‌లో ఉన్నట్లు అతనికి తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకొని, ఇంట్లోకి వచ్చాడు. ప్రియురాలి భర్తను చూసిన మోప్‌ాసిన్‌ భయంతో వణికిపోయాడు. అతన్నుంచి తప్పించుకు నేందుకు ఐదో అంతస్తులోని ఎª`లాట్‌ నుంచి కిందకు దూకేశాడు. దీంతో షాకైన మోప్‌ాసిన్‌ ప్రియురాలు
అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స పొందుతూ మోప్‌ాసిన్‌ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోప్‌ాసిన్‌ ప్రియురాలు, ఆమె భర్త పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోప్‌ాసిన్‌ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించామని, పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు.