కూరగాయల సాగుకు ప్రోత్సాహం

  

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన

యాసంగి పంటల కోసం అధికారుల చైతన్యం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు, పప్పు దినుసుల ఆరుతడి  పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వం ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలే వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉంది. అనుకూల రకాలను ఎంపిక చేసుకొని పండిస్తే లాభాలు వస్తాయని చెబుతున్నారు. మార్కెటింగ్‌ అవకాశం ఉన్న రైతులు పాలకూర, తోటకూర, బెండకాయ, గోరు చిక్కుడు, బీరకాయ, సోరకాయ సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, పెసర, మినుములు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు. యాసంగిలో వేరుశనగ ఆరుతడి పంటగా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధ్యమని రైతులు చెబుతున్నారు.  ఆవాలు,నువ్వులు,పొద్దుతిరుగుడు వంటి పంటలకు అవకాశాలు ఉన్నాయని అదికారులు సూచిస్తున్నారు.  ఆరుతడి పంటలను వేసే రైతులు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి మడుల్లో విత్తనాలు వేస్తున్నాం కాబట్టి మురుగు నీరు బయటకు వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. అకాల వర్షాలు, అనుకోకుండా నీరు ఎక్కువగా పారిం చినప్పుడు పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎర్ర నేలల్లో వేరుశనగా వేసుకోవాలి.  మినుములు, శనగలు నల్లరేగడి భూముల్లో సాగు చేయాలి. సాధ్యమైనంత వరకు వరి కోతలు ముగిసిన వెంటనే విత్తనాలు వేసుకోవాలి. ఆలస్యం అయ్యేకొద్ది పంట చివరి దశలో ఉష్ణోగ్రతలు పెరిగి  దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనగ, పెసర, మినుములు, జొన్నలు, పల్లి, నువ్వుల విత్తనాలు అందు బాటులో ఉన్నాయి. రాష్ట్ర విత్తనోత్పత్తి సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించే సొసైటీల్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.పంట మార్పిడి తప్పనిసరని సూచిస్తున్నారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవడం మంచిది. డిమాండ్‌కు తగ్గట్టు రైతులు ఎప్పటికప్పుడు పంటల సరళిని మార్చుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు కనీస నిరక ఆదాయం వస్తుందన్నారు. అయితే వరి పంట వేసి కొనుగోలు చేసే వారు లేకుంటే  కష్టనష్టాలు కొనితెచ్చుకోవ డమే అవుతుందని భయపడు తున్నారు. భూములను బీళ్లుగా వదిలేయడం కంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం మం చిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఇటీవల అధికారులతో నిర్వహించిన సవిూక్షా సమావేశంలో కలెక్టర్‌ అదేశించారు.  ధాన్యం కొనుగోళ్ల పక్రియ సర్కారుకు సవాళ్లుగా మారుతుండడంతో  రాష్ట్ర ప్రభుత్వం రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని దిశా నిర్దేశర చేసింది. కేంద్రం సైతం కొనుగోళ్లపై విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో  ఎక్కువ మంది రైతలు వరిని కాద ని ఇతర పంటను సాగు చేయడానికి సుముఖంగా లేరు.  ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు.