వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

 



పిల్లలోనూ వేంగగా విస్తరిస్తోందని గుర్తింపు
పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్న బ్రిటన్‌ పరిశోధకులు
న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది. సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారితో ఇప్పుడు బ్రిటన్‌, అమెరికా లాంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. అయితే, ఇప్పటికే పలు రకాల అధ్యయనాల్లో చాలా వేగంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపిస్తుందని తేలింది.. తాజాగా మరో స్టడీలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వ్యాధి తీవ్రత, ఆస్పత్రిపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని తేల్చింది యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌
పరిశోధన.. ఆ స్టడీ ప్రకారం.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిచెందినా.. దాంతో తీవ్ర అస్వస్థతకు గురకావడం, ఆస్పత్రల్లో చేరాల్సిన ముప్పు మూడిరట రెండు వంతులు తక్కువని తేల్చింది.
పిల్లల్లో కరోనా ప్రమాదానికి సంబంధించి బ్రిటన్‌లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడిరది. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇంగ్లండ్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌లోని శాస్త్రవేత్తలు పిల్లలకు టీకాలు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు. అదృష్టవశాత్తూ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నపిల్లలకు టీకా ఆమోదించారు.
ఇంపీరియల్‌ కాలేజీ, మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ ఇప్సోస్‌ మోరీ పరిశోధకులు పరిశోధన సమయంలో దాదాపు 97,000 కరోనా నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాలను నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 14 మధ్య తీసుకున్నారు. పరిశోధన అధ్యయనంలో ప్రాథమిక పాఠశాల పిల్లలలో 4.47 శాతం మందిలో కరోనా వైరస్‌ నిర్దారించారు. అయితే ఈ సంఖ్య దేశవ్యాప్తంగా 1.41 శాతం మాత్రమే. శాస్త్రవేత్తల ప్రకారం టీకాలు వేయడం వల్ల టీనేజర్లలో కరోనా కేసులు సగానికి తగ్గాయి. ఇంతకు ముందు కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఓమిక్రాన్‌ కేసులలో 66 శాతం పెరుగుదల ఉందని పరిశోధన పేర్కొంది. పిల్లలకు టీకాలు వేయించాలని శాస్త్రవేత్తలు సూచించారు. డిసెంబరు 11 వరకు వైరల్‌ సీక్వెన్సింగ్‌ డేటా ప్రకారం.. పిల్లలకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధన అధ్యయనం ప్రధాన పరిశోధకుడు పాల్‌ ఎలియట్‌ చెప్పారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన 650 నమూనాలలో 11 ఓమిక్రాన్‌కు చెందినవి కాగా మిగిలినవి ప్రీ`ఓమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టాకు చెందినవి. ఈ పరిశోధన అధ్యయనం సమయంలో కేసులు ప్రతిరోజూ 66 శాతం పెరిగాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ టీకా వేగాన్ని పెంచడం వల్ల ఈ రూపాంతరం పిల్లలకు లేదా పెద్దలకు ప్రాణాంతకం కాదని చెప్పారు.