అంగన్‌వాడీలను ఆదుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌21( జనం సాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌

వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు. ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆరోపించారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఐసీడీఎస్‌కు సరైన నిధుల కేటాయింపుల్లేకపోవడంతో వ్యవస్థ నీరుగారుతోందన్నారు. రానున్న బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని అన్నారు. ఏడాది నుంచి కార్యకర్తలకు టీఏ, డీఏ ఇవ్వలేదని, ఐదేళ్లుగా స్టేషనరీ కూడా చెల్లించలేదని ఇలాంటి కష్టాల్లో కార్యకర్తలు, ఆయాలుంటే వారి సమస్యలు ఎవరు పట్టించుకోవాలో చెప్పాలన్నారు. పలు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చామన్నారు.