పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి

చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల,డిసెంబర్‌16 (జనం సాక్షి): పేదింటి ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దవ్‌ దర్పల్లి, చింతలపేట కుంట వీధి, తెలుగు పేట, రాఘవేంద్ర కాలనీ, వడ్డె వీధి ప్రాంతాల్లోని లబ్దిదారులకు ఎమ్మెల్యే స్వయంగా వారి ఇళ్లకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ప్రస్తుతం ఇబ్బందులకు గురవు తున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వం వారికి చేయూతనిచ్చి ఆడపిల్ల పెళ్లిళ్లు చేయడానికి కల్యాణ, లక్ష్మి షాదీ ముబారక్‌ పథకాలతో అండగా నిలుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు వినియోగించు కోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ వార్డ్‌ కౌన్సిల,ర్‌ దవులు జడ్పీ వైస్‌ చైర్మన్‌ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.