ఆంగ్‌సాన్‌ సూకీకి మళ్లీ జైలునాలుగేళ్లు

  


జైలుశిక్ష విధించిన కోర్టు

న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనం సాక్షి); మయన్మార్‌కు చెందిన బహిష్కృత నాయకురాలు అంగ్‌సాన్‌ సూకీని మిలిటరీ ప్రభుత్వం మరోమారు జైలు శిక్షకు గురిచేసింది.ఆమెపై అభిమయోగాల ఆధారంగా చేసిన  అక్కడి న్యాయస్థానం నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. మిలిటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని రెచ్చగొట్టడం, సహజ విపత్తుల చట్టంలోని కొవిడ్‌ నియమాల ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది. మిలిటరీ ప్రభుత్వం అంగ్‌సాన్‌ సూకీపై మొత్తం 11 కేసులు బనాయించింది. అయితే ఆ అభియోగాలన్ని అబద్దాలని అంగ్‌సాన్‌ సూకీ కొట్టిపారేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని ఔఒఆ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ గత ఫిబ్రవరిలో మిలిటరీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్రభుత్వాన్ని కూల్చేసింది. అప్పటి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై రకరకాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, అమెపై నమోదైన అన్ని అభియోగాల్లో దోషిగా తేలితే సూకీకి వందేండ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్నది.