రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం

టూవీలర్‌ను ఢీకొన్న ట్రక్కు..సిసి ఫుటేజి ఆధారంగా గుర్తింపు

నివాళి అర్పించిన విూడియా కమిటీ ఛైర్మన్‌ అల్లం నారాయణ
హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): యువ జర్నలిస్ట్‌ ఓతూరి మధుసూదన్‌ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందారు. ఏబీఎన్‌`ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్‌ డెస్క్‌లో మధు సబ్‌`ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డ్యూటీకి వస్తుండగా బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ దగ్గర ఓ ట్రక్‌ మధు బైక్‌ను ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్‌.. బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మధుసూదన్‌ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్రక్కును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మధుసూదన్‌ మరణవార్త తెలుసుకున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసింది. సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలి వెళ్లారు. జర్నలిస్ట్‌ మధుసూదన్‌ మృతికి తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ నివాళులర్పించారు. మధు కుటుంబానికి అండగా నిలుస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ తరపున చేయాల్సిన సాయం చేస్తామని అల్లం నారాయణ తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్రక్కును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.