చావుడప్పు కొట్టి సాధించేదేమిటి


పార్టీని బలోపేతం చేసేందుకే ఉపయోగం

రైతుల తక్షణ సమస్య ధాన్యం సేకరణ మాత్రమే
కేంద్రాన్ని నిలదీసేక్రమంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు
హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): తెలంగాణలో బిజెపికి చావుడప్పు కొట్టిన టిఆర్‌ఎస్‌..రాజకీయంగా కొంత మైలేజీని సాధించినా..అంతే మొత్తంలో రైతుల ఆగ్రహానికి కూడా కారణమయ్యింది. ధాన్యం
కొనుగోలు చేయడం ఎవరి బాధ్యత అన్నది రైతులకు అనవసరం. రాష్ట్రంలో ధాన్యం కొనగడంలేదన్న బాధలో రైతులు ఉన్నారు. వారిని అనునయించి ధాన్యం కొనడానికి బదులు..చావుడప్పు మోగించడం వల్ల రైతుల సానుభూతి మాత్రం దక్కదని టిఆర్‌ఎస్‌ నేతలు గుర్తించడం లేదు. ఓ వైపు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తూ..చావుడప్పు కొట్టివుంటే రైతుల మద్దతు దక్కేది. కానీ బిజెపిని ఎదురించడానికే ఈ చావుడప్పు అని అందరికీ తెలిసిపోయింది. బిజెపి నుంచి పొచివున్న ముప్పును ఎదుర్కొనేందుకే అని తెలిసిపోయింది. ప్రజల్లో టిఆర్‌ఎస్‌ బలహీనతలను కప్పిపుచ్చుకుని, పార్టీ కార్యకర్తల్లో స్థయిర్యాన్ని నింపడానికి ఇది పనికి వచ్చింది. ’ధాన్యం కొంటరా.. కొనరా’ ఏదో ఒక్క మాట చెప్పండి అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గతంలోనే నిలదీసారు. దానికి కేంద్రం కూడా సమాధానం చెప్పింది. మరోమారు మంత్రుల బృందం ఢల్లీిలో మకాం వేసింది. అయినా తెలంగాణలో చావుడప్పు కొట్టడం వల్ల బిజెపి బెదిరిపోతుందని అనుకున్నా.. తమకు మైలేజీ వస్తుందని అనుకున్నా టిఆర్‌ఎస్‌ నేతలు పొరపాటు చేసినట్లు కాగలదు. ప్రతి ధాన్యం గింజను కొంటామని, ఎంతయినా పంటను పండిరచండని చెప్పింది టిఆర్‌ఎస్‌ అన్న విషయం మరవరాదు. తెలంగాణ రైతుపై కేంద్రం వివక్ష చూపుతోందని చెప్పడానికి బలమైన ఆధారాలు ఏవీ లేదు. అయితే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర విధానాలకు అనుగుణంగా ముందుకు సాగి.. మిగిలిన పంట ఉంటే రాష్ట్రం బాధ్యత వహించి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో పసిడి పంటలు పండుతుంటే బాధ్యతగా కొనాల్సింది పోయి కొర్రీలు వేస్తారా అని మండిపడ్డ టిఆర్‌ఎస్‌..చావుడప్పు కొట్టడం వల్ల విపక్షాలను కూడా నమ్మించలేరు. తెలంగాణ టిఆర్‌ఎస్‌ నాయ కత్వంలో చావుడప్పులు, ధర్నాలతో దద్దరిల్లింది. నాలుగు కూడళ్లలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇప్పటికైనా మోడీ తమ నిరసనలు చూసి కళ్లు తెరవాలని హితవుపలికారు. నల్లజెండాలు చేతబట్టుకుని, చావు డప్పులు మోగిస్తూ వేల సంఖ్యలో చౌరస్తాల వద్దకు కదిలారు. రైతులను రాజకీయంగా వాడుకోవద్దని, టిఆర్‌ఎస్‌కు వాళ్లను దూరం చేసే కుట్రలకు పాల్పడవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేయడం మానుకొని చేయాలని నినదించారు. ’ఊరూరా చావు డప్పు’ పేరిట నిర్వహించిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎ లు, టిఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరి కంకులు చేతపట్టకుని, ధాన్యం బస్తాలను నెత్తిన పెట్టుకుని ఎండ్ల బండ్ల ర్యాలీలు తీస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదంతా తోణ సమస్యను పరిష్కరించే చర్య కాదు. పుండువిూద కారం చల్లినట్లుగా రైతులను అనవసరంగా రెచ్చగొట్టేలా మాత్రమే ఉంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరును గర్హిస్తూ చావుడప్పుల నిరసనలతో లాభం లేదని గుర్తించాలి. కేంద్రంతో పోరాడాల్సిన పద్దతి ఇది కాదని గుర్తించాలి. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేయాల్సిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిలదీయా ల్సిందే. ఈ విషయంలో మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరగాల్సిందే. రైతులను మోడీ ఆగం చేస్తున్నదని చెప్పగలగాలి. నిజానికి రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సా హం కల్పించడం వల్లనే తెలంగాణలో రైతులు వరి వేసారు. ప్రభుత్వం మాటలను నమ్మి రైతులు పెద్ద ఎత్తున వరిని పండిరచి మోసపోయారు. తమకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఉన్నారు. ఇక్కడ కేంద్రం వేరన్న విషయం రైతులకు తెలియదని గుర్తిచాలి. దేశానికి అన్నం పెట్టే రైతులు చల్లగా ఉండాలంటే కేంద్రం లేదా రాష్ట్రం సమన్వయంతో పంటను కొనాల్సిందే. రైతులు పండిరచిన ధ్యాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రానికి గట్టిగా డిమాండ్‌ చేయాల్సిందే. దేశంలో రైతులు పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని, పండని చోట, ప్రకృతి
విలయాలు ఏర్పిడన చోట ప్రజలకు అవసర మైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన విధి కావాలి. పంటలు పండిరచడమే రాష్ట్రం బాధ్యత అని,దానిని పూర్తిగా కొనే బాధ్యత కేంద్రానిదేనని టిఆర్‌ఎస్‌ వాదిస్తోంది. అయితే ఇది రైతులతో వాదించే సమయంకాదు. సిఎంగా కెసిఆర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాతనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా అవుతోంది. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాతనే పెట్టుబడి సాయంగా రైతులకు ఇప్పటికే రూ. 50వేల కోట్లు నగదుగా అందజేశారు. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం యేటా రూ.45 వేల కోట్ల వెచ్చిస్తోంది. రైతులకు సాగునీరు వస్తుండడంతో పెద్దఎత్తున అందుబాటులోకి రావడంతో వరి బాగానే పండిరది. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే. రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌ పథకాలు తీసుకొచ్చారనడంలో సందేహం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు విూద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని టిఆర్‌ఎస్‌ మండిపడడంలోనూ సందేహం అక్కర్లేదు. అయితే కేంª`ద్రంతో మాట్లాడి నిరసనలు తెలియచేయడంలో తోణ సమస్య పరిష్కారం కాదు. ముందుగా ధాన్యం సేకరణ జరగాలి. అప్పుడే రైతుల బాధలు తీరుతాయని గుర్తించాలి. అందుకు ధాన్యం సేకరణ ఒక్కటే తక్షణ పరిష్కారంగా చూడాలి.