సాయితేజ కుటుంబానికి కోటి ఇవ్వాలి:చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని  చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవిూర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.  సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. గిరిజన కుటుంబంలో జన్మించిన సాయి తేజ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.