గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా సాయిచంద్‌ బాధ్యతలు

 

హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ గా సాయిచంద్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ రావు సాయిచంద్‌ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చారని అన్నారు. కెసిఆర్‌ నమ్మకంతో కల్పించిన అవకాశానికి వన్నె తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి,
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.