చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన
జనగామ,డిసెంబర్11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. విత్తనాలను ఉత్పత్తిచేసే గ్రామాలను గుర్తించి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పంటల బీమా పథకాన్ని ప్రతి రైతు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహించి వారిని చైతన్యపరచాలన్నారు. అలాగే ప్రత్యమ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఈ మేరకు రైతులను చైతన్యం చేయాలన్నారు. ఇదిలావుంటే సంక్షేమ వసతిగృహాల్లో పూర్తిస్థాయి ప్రవేశాలు కల్పించడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సవిూక్షిస్తూ గ్రామాలవారీగా గర్భిణుల సంఖ్య, తదితర వివరాలను సేకరించి వారికి కావాల్సిన పౌష్టికాహారం అందించాలన్నారు.