బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌


దేశంపై విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌

లండన్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. డెల్టా వైరస్‌ తగ్గుముఖం పట్టకుండానే.. ఒమిక్రాన్‌ దేశంపై విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,06,122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులే 13 వేలకు పైగా ఉండటం ఆందోళనకరం. మొత్తంగా 69 వేలకు పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒమిక్రాన్‌ కేసుల విషయంలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కేసులు బ్రిటన్‌లోనే వెలుగుచూశాయి. కరోనా కేసుల ఉధృత నేపథ్యంలో బ్రిటన్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు టీకాలు పంపిణీ చేసేందుకు అంగీకరించింది. 5 నుండి 12 ఏళ్లలోపు చిన్నారులకు టీకా అందించాలని నిర్ణయించింది. ్గªజైర్‌`బయోఎన్‌టెక్‌ అభివఅద్ధి చేసిన ్గªజైర్‌ టీకాను తక్కువ మోతాదులో పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది. 5`11 ఏళ్ల వారికి ఎనిమిది వారాల వ్యవధితో రెండు డోసులు ఇవ్వనున్నారు. ఇక దీంతో పాటు 16, 17ఏళ్ల వారికి బూస్టర్‌ డోసులను ఇచ్చే అంశంపైనా యూకే ప్రభుత్వం దఅష్టిపెట్టింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ 18ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోసులతో పాటు బూస్టర్‌ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు.
ఇక 12`17ఏళ్ల వారికి రెండు డోసులు టీకాలను అందిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ విషయంలో ఓ గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. గత డెల్టా వైరస్‌తో పోల్చుకుంటే ఒమిక్రాన్‌ సోకడం వల్ల ఆసుపత్రికి వెళ్లే రిస్క్‌ తక్కువగా ఉన్నట్లు రెండు అధ్యయనాల్లో తేలినట్లు బ్రిటన్‌ ప్రచురించింది. స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ ప్రాథమిక అధ్యయనాలను నిపుణులు ఆహ్వానించినప్పటికీ.. ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావచ్చునని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువని అధ్యయనంలో తేలడం శుభవార్తేనని స్కాట్లాండ్‌ అధ్యయనం సహా రచయిత జిమ్‌ మెక్‌మెనామిన్‌ అన్నారు. ముందస్తు పరిశీలనలు.. ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తాయని తేలిందని పేర్కొన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో నమోదైన కోవిడ్‌ కేసుల ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టింది. డెల్టా వల్ల సంభవించిన కేసులను, ఒమిక్రాన్‌ కేసుల సమూహంపై ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇంగ్లాండ్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన అధ్యయనానికి సహ రచయిత ఉన్న అజ్రాఘని సైతం ఇటువంటి విషయాన్నే వెల్లడిరచారు. ఆసుపత్రిలో చేరే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. వ్యాప్తి వేగం ప్రమాదకరంగా ఉందని అన్నారు.