వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్‌ కంపెనీ

 


స్వాగతించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఐటీ దిగ్గజ కంపెనీ జెన్‌ ప్యాక్ట్‌ వరంగల్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించడం పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది వరంగల్‌ ప్రజలకు శుభవార్త అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆ కంపెనీ సీఈఓ త్యాగరాజన్‌ ఈ ప్రకటన చేయడం, మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. వరంగల్‌ లో ఇప్పటికే టెక్‌ మహీంద్రా, సయింట్‌ ఆఫీస్‌లు పెట్టగా తాజాగా జెన్‌ ప్యాక్ట్‌ రావడం వరంగల్‌ వాసులకు గొప్ప వార్త అన్నారు.
ఈ కంపెనీల రాకతో ఇక్కడి నిరోద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధుల పక్షాన మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.