టిఆర్‌ఎస్‌ వైపే ప్రజలు

మరోమారు రుజువయ్యింది: శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారనడానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడమేనని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కే పడ్డాయన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటు న్నారని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్‌` బీజేపీ ప్రజాప్రతినిధులు సైతం కేసీఆర్‌ అభివృద్ధికి ఓటు వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు సైతం టీఆర్‌ఎస్‌ పథకాలు అందుతున్నాయి. పచ్చని తెలంగాణను నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మేం ఎవరికి భయపడమని, జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ పథకాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఎంపీటీసీల సమస్యలు కొన్ని తీర్చాం. భవిష్యత్‌లో అన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.