ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

  


 ఇప్పటికే 41 దేశాలకు పాకినట్లు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనం సాక్షి);   ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుతుందని సంబరపడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌తో వేగంగా విస్తరిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 41 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క దక్షిణాఫ్రికాలో 217మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారు. దీంతో మళ్లీ ఏడాదిన్నర కిందటి పరిస్థితులు తలెత్తుతాయా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పాకిన రాష్టాల్ర జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్‌, వాషింగ్టన్‌ కూడా చేరాయి. ఇప్పటికే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వే నియా, మేరీలాండ్‌, మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ సెంటర్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండిరతలకు పెరగింది. మరోవైపు డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. ఎమ్జ్గంªన్సీ కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు. ఇటు భారత్‌లోనూ ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది న్యూ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్ట్స్‌ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు.. ఢల్లీిలో ఇంకో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. టాంజానియా నుంచి ఢల్లీికి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్‌ సోకింది. దీంతో దేశంలో 3 రోజుల్లోనే 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగానే దేశమంతా అలెర్ట్‌ అయింది. కానీ ఇప్పుడు మరో మూడు కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్‌ లోని జామ్‌నగర్‌కు వచ్చిన 72 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్దారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి జింబాబ్వే నుంచి జామ్‌నగర్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపించారు. ఆ పరీక్షల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడిరది. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ విూదుగా ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్దారణ అయ్యింది. అతను వ్యాక్సిన్‌ తీసుకోలేదని తేలింది. విదేశాల నుంచి ముంబైకి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్‌ తేలింది. తమిళనాడు వచ్చిన ఐదుగురికి చేసిన టెస్టుల్లోనూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతేకాదు.. విదేశాల నుంచి ఇండియాలోని మిగతా నగరాలకు వచ్చిన వారిలో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎంత మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందో.. ఎంత మందికి నాన్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందనేది తేలాల్చి ఉంది. వారందరికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్దారణ అయితే దేశంలో ఈ కొత్త వేరియంట్‌ జెట్‌ స్పీడ్‌లో వ్యాపిస్తుందనే ఆందోళనలు వ్యాక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్‌తోనే టెన్షన్‌ పడుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజే 2,796 మరణాలు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎంత మందిని చంపుతుందోననే భయం వెంటాడుతోంది. మరోవైపు తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గడిచిన ఐదు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో డిసెంబర్‌ 1న 184 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. డిసెంబర్‌ 2న 189 కేసులు.. డిసెంబర్‌ 3న 198 కేసులు వచ్చాయి. కానీ డిసెంబర్‌ 4న 213 మందికి కరోనా సోకింది. అటు ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్టాల్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్‌ భయం మనుషులను రాక్షసులుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో సైకోగా మారిన డాక్టర్‌ తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అందరినీ చంపేస్తుంది. శవాలను లెక్కించడం నా వల్ల కావడం లేదు.. అని డైరీలో రాసిన డాక్టర్‌ సుశీల్‌ కుమార్‌ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తరువాత పారిపోయాడు. మరోవైపు తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక తెలంగాణ, ఏపీలోనూ రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రెండు రాష్ట్రల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.``````````````దేశీయంగా మరోమారు పెరిగిన పసిడి ధరలుపెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ధరల్లో పెరుగుదలముంబై,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ):  మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ఇక చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ధరలు ఒక పెరిగి పెరిగితే ఒక రోజు తగ్గుతుంది.. లేకపోతే స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక తాజాగా సోమవారం డిసెంబర్‌ 6న దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల భారీగా పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగానూ, మరి కొన్ని నగరాల్లో భారీగా, మరి కొన్ని నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. మొత్తం విూద దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా పెరిగింది. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది. తాజాగా దేశీయంగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.  దేశ రాజధాని ఢల్లీిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.  కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.  విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,830గా ఉంది.