కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


ఖమ్మం,డిసెంబర్‌21(జనం సాక్షి): ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్‌ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ రూ.2.23 కోట్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయలను మేయర్‌ పునుకొల్లు నీరజతో కలిసి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ లబ్దిదారులకు అందించారు. బైక్‌ పై అన్ని డివిజన్లలో తిరిగి లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి స్వయంగా చెక్కులు పంపిణీ చేశారు. ఉదయం త్రీటౌన్‌ లోని పలు డివిజన్లలో వీటిని పంపిణి చేశారు.