ఒమైక్రాన్‌ భయంతో న్యూ ఇయర్‌ వేడుకలు రద్దు

ఆఫర్లతో ముందుకు రాని వ్యాపారులు

కాకినాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉండడం, అనేక జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడంతో వ్యాపారులు బేర్‌మంటున్నాయి. వాస్తవానికి ఏటా న్యూఇయర్‌ వేడుకలకు విందు వినోదాల కోసం కాకినాడ, రాజమహేంద్రవరంలో కొన్ని స్టార్‌ హోటళ్లు ఎప్పటిలా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, చిన్నహోటళ్లు రూ.2 లక్షల వరకు పెట్టుబడితో వేడుకలకు ప్రణాళికలు రచించాయి. తీరా కొత్త వేరియంట్‌ భయంతో వెనక్కు తగ్గాయి. జిల్లాలో డిసెంబర్‌ 31 రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కాకినాడ, రాజమహేంద్రవరం వాస్తవానికి ఏటా ఈ సమయానికి కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, తుని తదితర పట్టణాల్లో కాకినాడలో జీఆర్‌టీ, సరోవర్‌పోర్టికో, రాయల్‌పార్క్‌, సిటీఇన్‌, జయ రెసిడెన్సీ, రాజమహేంద్ర
వరంలో షెల్టాన్‌, ఆనంద్‌ రీజెన్సీ, రివర్‌బే, జెట్టీగ్రాండ్‌ తదితర హోటళ్లు, టూరిజం కార్పొరేషన్‌ పరిధిలో
రిసార్టులు, ఫంక్షన్లు హాళ్లు డిసెంబర్‌ 31 వేడుకల కోసం సిద్ధమయ్యేవి. కానీ ఇప్పుడు మల్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌తో కొత్త సంవత్సర వేడుకలకు స్వస్తి చెప్పారు.