నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అనంతపురం, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినా పంటల రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బస్సుయాత్ర భాగంగా రైతు సంఘం జిల్లా నాయకులు లింగారెడ్డి కెవిపిఎస్‌ నాయకులు రామాంజనేయులు అన్నారు. పట్టణంలోనే గాంధీ బజార్‌ వద్ద బస్సు యాత్ర భాగంగా నాయకులు మాట్లాడారు. కేవలం పెనుకొండ మున్సిపాలటీ ఎన్నికలకు మొత్తం ఎమ్మేల్యేలని దింపిన ప్రభుత్వం అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కేవలం పరిశీలనకి గానీ, రామర్షకు గాని రాకపోవడం దుర్మార్గం అన్నారు. ఎక్కడ చూసిన వేరుశనగ పంట కుల్లిపోయింది. మొక్క జొన్న పంటలు పూర్తీగా కంకిలోనే మొలకలు వచ్చి బూజు పట్టి తీవ్రనష్టం వాటిల్లింది. రకర పంటను రైతులు ఎండకు ఆరబోసి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని అన్నారు. డల వ్యాప్తంగా వందల ఎకరాలు సాగు చేస్తే మొత్తం విస్థీర్ణం అకాల వర్షాలకు నష్టపోయిన కేవలం కొన్నిఎకరాలు మాత్రమే నష్టం కలిగినట్లు అధికారులు ప్రతి పాధన పంపడం దారుణం అని అన్నారు.