` కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్,డిసెంబరు 8(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో వరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఆడుతోన్న పొలిటికల్ డ్రామా అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్‌పై అవగాహన లేదని విమర్శించారు.