పేదలతో కలసి లోకేశ్‌ ర్యాలీ

గుంటూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ... పేదల ఇళ్ల తొలగింపు నోటీసును ఉపసంహరిం చాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలో నిర్మిస్తున్న డివైడర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోకేష్‌ వస్తే పేదల ఇల్లు తొలగిస్తారు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని... అదే పని ఎమ్మెల్యే ఆర్కే చేస్తున్నాడని లోకేష్‌ యెద్దేవా చేశారు.