విస్తరిస్తున్న ఒమిక్రాన్‌


` కొత్తవేరియంట్‌తో తలనొప్పులు
` ఢల్లీిలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు
న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్‌ కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,906 మంది బాధితులు కోలుకున్నారని, వైరస్‌ బారినపడి 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,58,481కు పెరగ్గా.. ఇందులో 3,42,01,966 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,78,325 మంది ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. అలాగే కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 213కు పెరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఢల్లీిలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీ, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. ఇందులో ఇప్పటి వరకు 90 మంది కోలుకున్నారని చెప్పింది.దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడిరచారు. కాగా.. ఈ నెల 12 ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు శాంపిళ్లను జీనోమ్‌ సీక్వేన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 214 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 15 రాష్టాల్ల్రో ఈ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు.
ఢల్లీిలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేసేందుకు ఢల్లీి ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో గుంపులుగా పాల్గొనకుండా నిబంధనలు విధించారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో గుంపులుగా చేరితే వైరస్‌ మరింత స్పీడ్‌గా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ దిశగా ఢల్లీి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధాని పరిధిలో గుంపులుగా చేరి క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ ఢల్లీి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా ఢల్లీి పోలీసులు, జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, పరిస్థితులపై రోజువారీగా రిపోర్ట్‌ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కెట్లలో షాపింగ్‌కు వెళ్లే వాళ్లు మాస్క్‌ పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నో మాస్క్‌.. నో ఎంట్రీ నిబంధనను పక్కాగా అమలు చేసేలా మార్కెట్‌ ట్రేడ్‌ అసోసియేషన్లను ఆదేశించింది. అలాగే పండుగలు, వినోద కార్యక్రమాలు, కల్చరల్‌ ఈవెంట్స్‌, మతపరమైన వేడుకలు, పొలిటికల్‌, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కు సంబంధించి గ్యాదరింగ్స్‌, సమావేశాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే బార్‌లు, రెస్టారెంట్లు లాంటివి 50 శాతం సీటింగ్‌తో ఓపెన్‌ చేసుకోవచ్చని, పెళ్లిళ్లు లాంటివి ఫంక్షన్లు 200 మంది అతిథులతో జరుపుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడిరచింది.