విశాఖ కెజిఆహెచ్‌పై సోము కన్ను

 దాని పేరునూ మార్చాలంటూ డిమాండ్‌

రాజమహేంద్రవరం,డిసెంబర్‌31 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన దృష్టి ఇప్పుడు విశృాఖ కెజిహెచ్‌పై పడిరది. తాము అధికారంలో వచ్చాక మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని ఇటీవల బీజేపీ బహిరంగ సభలో ప్రకటిస్తూ విమర్శలపాలయ్యారు. దీంతో సోమువీర్రాజును కాస్త నెటిజన్లు ’సారాయి వీర్రాజు’ అంటూ సోషల్‌ విూడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. అయితే నిత్యం ఇలా వార్తల్లో నిలవడమే పనిగా పెట్టుకున్నారో ఏమోగానీ తాజాగా వీర్రాజు మరో సంచలన ప్రకటన చేశారు. విశాఖ మహానగరంలో కేజీహెచ్‌ ఆస్పత్రి పేరు వెంటనే మార్చాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘అసలు కింగ్‌ జార్జ్‌ ఎవరు... ఇందులో కింగ్‌ ఎవరు..? జార్జ్‌ ఎవరు..?‘ వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఇప్పుడు కెజిహెచ్‌ కూడా వార్తల్లో నిలవనుంది.