మరో మూడు రోజులపాటు చల్లని గాలులు


తెలుగు రాష్టాల్ల్రో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతు న్నాయి. చలిగాలు తీవ్రత పెరుగుతోంది. రెండు రాష్టాల్ల్రోని పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రరూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ చలిగాలులు మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నది. పొగమంచు కారణంగా రాత్రిపూట రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, చలి గాలుల తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.