‘రాయ్‌’తుపాను

  


భారీ వర్షాలకు 31 మంది దుర్మరణం

మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్‌ ‘రాయ్‌’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్‌ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి. దినగట్‌లోని నివాసాల్లో 95% వరకు నేలమట్టమయ్యాయి. స్కూళ్లు, ఆస్పత్రులతోపాటు అత్యవసర షెల్టర్లు దెబ్బతిన్నాయి.  సియార్గావో నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం తదితర  ఘటనల్లో ఇప్పటివరకూ 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. సుమా రు 3 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లేకుంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో గురువారం నుంచే మొదలైన తీవ్ర గాలులు, వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇప్పటికీ వీలుకాలేదని తెలిపారు.